బతుకమ్మ వేడుకలు ప్రారంభం.. 2 m ago

featured-image

ద‌స‌రా పండుగ వ‌చ్చిందంటే మ‌హిళ‌ల‌కు పెద్ద ఆనందాన్ని తెచ్చిపెడుతుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఏడాదంతా ఉద‌యం నిద్ర‌లేచిన ద‌గ్గ‌ర‌ నుండి రాత్రి ప‌డుకునే వ‌ర‌కూ ఇంటిప‌ని, వంట ప‌నుల‌తోపాటు పొలం ప‌నులు, ఉద్యోగ ప‌నుల‌తో బిజీ బిజీగా జీవితాన్ని గ‌డిపే మ‌హిళ‌ల‌కు ద‌స‌రా తొమ్మిది రోజులూ చిన్న‌పిల్ల‌లైపోయి ఆనంద ప‌ర‌వ‌శుల‌వుతుంటారు. అదే బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా ఆట‌, పాట‌ల‌తో ఎన‌లేని ఆనందాన్ని పొందుతుంటారు. ఆ తొమ్మిది రోజులు వెంప‌ల చెట్టును ప్ర‌తిష్టించి గౌరీదేవిగా కొలుస్తూ జాన‌ప‌దాలు, బ‌తుక‌మ్మ పాట‌ల‌తో చిందేస్తుంటారు. ఇదే స‌మ‌యంలో ఆ 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని వండి బ‌తుక‌మ్మ‌కు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు..క‌ల‌సి పాల్గొన‌డం విశేషం.

రోజుకొక‌ ర‌క‌మైన నైవేద్యం

బతుకమ్మ 9 రోజులపాటు రోజుకొక‌ రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. కానీ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారుచేస్తారు.

తొమ్మిది రోజుల బ‌తుక‌మ్మ‌లు ... ఇలా

1. ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి.

2. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి.

3. ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి.

4. నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

5. అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి.

6. అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. ఈనాడు నైవేద్యమేమి సమర్పించరు.

7. వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి.

8. వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి.

9. సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.

చివరి రోజు నిమ‌జ్జ‌నం

తొమ్మిది రోజులపాటు బతుకమ్మను పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. గానాబజానాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూలతో తయారు చేసిన బతుకమ్మ శిరస్సుపై కొలువుంచిన పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మాంగళ్యానికి అంటే పుస్తెకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు మాలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD